జనగామ: త్వరలోనే చిల్పూరు మండలంలో కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తానని, ఏడాదిలో నిర్మాణాలను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. చిల్పూరు మండలంలోని 76 మందికి కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఇవాళ ఎమ్మెల్యే చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు ఉన్నారు.