ప్రభాస్ ‘రాజాసాబ్’ మూవీ ఇవాళ థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ సినిమా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ‘భూల్ భులయ్యా’ మూవీని పోలి ఉందని ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై మేకర్స్ స్పందించారు. అందులో నిజం లేదని నిర్మాత విశ్వప్రసాద్ తెలిపాడు. ఇది పూర్తి భిన్నమైన కథ అని, ప్రభాస్ కోసం కొత్త ప్రపంచాన్ని సృష్టించామని చెప్పాడు. ఇప్పటివరకూ ఇలాంటి కథ రాలేదని, విజువల్స్ కొత్తగా ఉంటాయన్నాడు.