ఎన్టీఆర్ డై హార్డ్ ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు. కానీ హీరో విశ్వక్ సేన్‌కు మించిన డై హార్డ్ ఫ్యాన్ లేరనే చెప్పాలి. సమయం, సందర్భం వస్తే చాలు.. టైగర్ పై తనకున్న అభిమానాన్ని చాటుతునే ఉంటాడు. కానీ తాజాగా విశ్వక్ చేసిన కామెంట్స్‌కు టైగర్ ఫ్యాన్స్‌కు కాస్త షాకింగ్‌గానే ఉంది.
Bro what is this.. Vishwak Sen shock for NTR fans?
Vishwak Sen: అసలు ఇండియాలో ఎన్టీఆర్‌ను మించిన యాక్టర్ లేడు, మాస్ అమ్మ మొగుడు.. అంటూ ఎన్టీఆర్‌కు విశ్వక్ ఇచ్చే ఎలివేషన్‌కు నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతుంటారు. కానీ ఇప్పుడు విశ్వక్ చేసిన కామెంట్స్‌తో టైగర్ ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. ప్రస్తుతం విశ్వక్ సేన్ నటించిన’గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా.. మే 31న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నేహా శెట్టి హీరోయిన్గా నటించింది. అంజలి కీలక పాత్ర పోషిస్తుంది. రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో.. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో.. యాంకర్ సుమ చేసిన ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు విశ్వక్. ఈ సందర్భంగా.. ఒకవేళ మీరు ఎన్టీఆర్ సినిమాను రీమేక్ చేస్తేచ ఏ సినిమా చేస్తారు? అని అడిగింది సుమ.
దీనికి విశ్వక్ సేన్.. ఏ మాత్రం ఆలోచించకుండా, వెంటనే ‘నా అల్లుడు’ రీమేక్ చేస్తానని చెప్పాడు. ఈ ఆన్సర్‌కు సుమ కాస్త షాక్ అయింది. ఎందుకంటే.. నా అల్లుడు ఫ్లాప్ అయింది. ఎవరైనా హిట్ సినిమాను రీమేక్ చేస్తామని అంటారు, కానీ విశ్వక్ మాత్రం ఫ్లాప్ సినిమా రీమేక్ చేస్తానని చెప్పడం విశేషం. ఆ సినిమా నాకెంతో ఇష్టం, కొన్ని మార్పులు చేసి రీమేక్ చేయొచ్చు.. అని చెప్పుకొచ్చాడు. ఇదొక్కటి చాలదు.. విశ్వక్ సేన్, ఎన్టీఆర్‌కు ఎంత డై హార్ట్ ఫ్యాన్ అని చెప్పడానికి అని కొందరు కామెంట్స్ చేస్తుండగా.. ఎందుకు బ్రో మళ్లీ ఆ సినిమాను మళ్ళీ గుర్తు చేస్తావు ఇంకొందరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి నిజంగానే నా అల్లుడు సినిమాను విశ్వక్ సేన్ రీమేక్ చేస్తాడేమో చూడాలి.