MBNR: ప్రజల నమ్మకానికి, భరోసాకు ప్రతిక ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి అని ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డి అన్నారు. శుక్రవారం ఆస్పత్రిని సందర్శించి అక్కడ ప్రజలకు లభిస్తున్న సేవల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రతి వార్డును క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అన్ని వసతులు ఉంటాయని పేర్కొన్నారు.