TG: డీజీపీ శివధర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. డీజీపీ శివధర్ రెడ్డి నియామక ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. పూర్తిస్థాయి డీజీపీ నియామకాన్ని 4 వారాల్లో పూర్తి చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను ఫిబ్రవరి 5కి వాయిదా వేసింది.