కేంద్ర కార్మికశాఖ.. గిగ్ వర్కర్ల నమోదుకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.16-60 ఏళ్లు నిండినవారు మాత్రమే నమోదు చేసుకోవడానికి అర్హులని తెలిపింది. ఈ శ్రమ్ పోర్టల్లో ఆధార్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తే ప్రత్యేక UAN, డిజిటల్ కార్డు జారీ చేస్తామని వెల్లడించింది. సామాజిక భద్రతా పథకాలను పొందాలంటే వార్షికంగా కనీసం 90 రోజులు పనిచేయాలని స్పష్టం చేసింది.