»What Happens When You Eat Mangoes Ripened With Calcium Carbide Know All Side Effects From Experts
mangoes : కార్బైడ్‌తో మగ్గిన మామిడి పండ్లు తింటే ఎన్నో అనారోగ్యాలు!
మార్కెట్లో కాల్షియం కార్బైడ్ పెట్టి కృత్రిమంగా ముగ్గించిన మామిడి పండ్లు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. వీటిని తినడం వల్ల ఎన్నో అనారోగ్యాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
Artificially ripened mangoes: వేసవి కాలంలో ఎక్కువగా దొరికే మామిడి పండ్లను తినడం అంటే అందరికీ చాలా ఇష్టం. అయితే వీలైనంత వరకు సహజంగా పండిన మామిడి పండ్లను మాత్రమే తినాలి. మనకు మార్కెట్లో దొరికేవి చాలా వరకు కాల్సియం కార్బైడ్(calcium carbide) పెట్టి మగ్గించినవే. అవి తినడం వల్ల అనారోగ్యాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఆ పండ్ల మధ్యలో కార్బైడ్‌ను పెట్టడం వల్ల అది ఎసిటిలిన్ అనే వాయువును విడుదల చేస్తుంది. దాంట్లో ఆర్సెనిక్, భాస్వరం లాంటి వాటివి ఉంటాయి. ఈ అవశేషాలు పండ్ల పై భాగంలో పేరుకుపోతాయి.
అలా ముగ్గిన మామిడి పండ్లను(mangoes) తినడం వల్ల జీర్ణాశయ సమస్యలు తలెత్తుతాయి. ఆర్సెనిక్, భాస్వరం లాంటివి పేగుల్లోకి చేరి చికాకు పెడతాయి. ఫలితంగా వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి లాంటివి కలుగుతాయి. అలాగే ఆర్సెనిక్ వల్ల నాడీ సంబంధమైన ఇబ్బందులు తలెత్తుతాయి. మైకం, తలనొప్పి లాంటివి కలుగుతాయి. ఇంకా ఎసిటిలిన్ వాయువును పీల్చడం వల్ల శ్వాస సంబంధమైన ఇబ్బందులు తలెత్తుతాయి. దగ్గు, శ్వాస ఆడకపోవడం, చికాకు లాంటివి కలుగుతాయి.
ఇలా మార్కెట్లోంచి తెచ్చుకున్న పండ్ల విషయంలో తినే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. దుష్ప్రభావాలు కాస్త తగ్గుముఖం పడతాయి. పండును తినాలని అనుకున్నప్పుడు గంట ముందుగా తీసి నీటిలో నానబెట్టండి. ఇలా చేయడం వల్ల మామిడి పండు(mango) తొక్కపై ఉన్న ప్రమాదకరమైన రసాయనాలు తొలగిపోతాయి. అలాగే తొక్కను తినే ప్రయత్నం చేయకండి. దాన్ని పూర్తిగా పీల్ ఆఫ్ చేసి తినండి. ఇలా చేయడం మామిడి పండు పైన ఉండే రసాయనాలు మన శరీరంలోకి చేరుకోకుండా ఉంటాయి.