BDK: చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని పలు ఏజెన్సీ గ్రామాల్లో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ సోమవారం కమ్యూనిటీ హాళ్ళను ప్రారంభించారు. చర్ల మండలం కుర్నపల్లి, బత్తినపల్లి, చెన్నాపురం, దుమ్ముగూడెం మండలం చింతగుప్ప, ముల్కనపల్లి ఏజెన్సీ గ్రామాల్లో నివసించే ఆదివాసి ప్రజలకు ఈ కమ్యూనిటీ హాళ్లు కార్యక్రమాలకు ఉపయోగపడతాయని తెలిపారు.