Arvind Kejriwal: Interim bail for Delhi CM Arvind Kejriwal
Arvind Kejriwal: మద్యం కుంభకోణంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు వివాదంలో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయనకు జూన్ 1 వరకు బెయిల్ ఇస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. జూన్ 5వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభ్యర్థించారు. కానీ ధర్మాసనం దీనిని తిరస్కరించింది. జూన్ 2న ఆయన లొంగిపోయి తిరిగి జైలుకు వెళ్లాలని తెలిపింది. అలాగే బెయిల్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ఈ రోజు సాయంత్రంలోగా కేజ్రీవాల్ జైలు నుంచి విడుదల కానున్నారు.
కేజ్రీవాల్ అభ్యర్థనను ఈడీ వ్యతిరేకించింది. ఎన్నికల ప్రచారం కారణంతో ఆయనను విడుదల చేయడం సరికాదని తెలిపింది. దీనికి ధర్మాసనం ఏడాదిన్నర నుంచి ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నారు. కానీ మార్చిలో అతనిని అరెస్టు చేశారు. ఇప్పుడు 21 రోజులు బెయిల్ ఇచ్చినంత మాత్రాన పెద్ద తేడా ఏం లేదని తెలిపింది. ఈ కేసులో ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను మార్చి 21న అరెస్టు చేశారు.