Kavitha: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు కోర్టులో చుక్కెదురైంది. మధ్యంత బెయిల్ కోసం కవిత వేసిన పిటిషన్పై విచారణను వాయిదా వేసింది కోర్టు. మే 24 వ తేదీకి వాయిదా వేస్తూ తాజాగా ఢిల్లీ కోర్టు తీర్పు ఇచ్చింది. మద్య పాలసీ కేసులో మొదటి రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ వేసింది. అక్కడ ఆమెకు బెయిల్ ఇవ్వడానికి అనుమతి లేదని తెలపడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. ఈ రోజు విచారణ జరగుతుందని ఆశించారు కానీ కోర్టు వాయిదా వేసింది.
మొదట కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని పరిగణలోకి తీసుకొని పిటిషన్పై విచారణ అనంతరం నిర్ణయం తీసుకుంటామని కోర్టు తెలిపింది. అయితే ఈడీ తరఫు న్యాయవ్యాదులు విచారణకు కొంత సమయం ఇవ్వాలని కోర్టును కోరారు. దాంతె బెయిల్పై విచారణ రెండు వారాల పాటు నిలిపివేశారు. మే 24 లోపు ఈడీ తన స్పందనను తెలియజేయాలని జస్టిస్ స్వరణ కాంత శర్మ ఆదేశాలు జారీ చేశారు.