Hindu Population:భారత్‌లో అత్యధిక మెజారిటీ ఉన్న హిందూ జనాభా(Hindu Population) 1950ల నుంచి 2015 మధ్య కాలంలో 7.81 శాతం తగ్గిందట. ఈ విషయాన్ని ప్రధానికి చెందిన ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ రిపోర్ట్ వెల్లడించింది. 1950 నాటికి హిందూ(Hindu) జనాభా 84.68 శాతం ఉండేది. అది 2015 నాటికి 78.06 శాతానికి పడిపోయింది. అలాగే ఈ గడచిన 65 ఏళ్ల కాలంలో ముస్లింల జనాభా 9.84 శాతం నుంచి 14.09 శాతానికి పెరిగింది.
భారత్‌లో మైనార్టీలు ఇప్పుడు హాయిగా బతుకుతున్నారని అందువల్లే వారి జనాభా సైతం పెరుగుతోందని రిపోర్టు తెలిపింది. భారత ప్రభుత్వం అనుసరిస్తున్న సామాజిక విధానాల వల్ల మైనార్టీల జనాభా పెరుగుతోందని పేర్కొంది. ఇక్కడ హిందూ జనాభా తగ్గుతుండగా మరో వైపు సిక్కు, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధ జనాభా(Population) పెరుగుతోందని తెలిపింది. అయితే గడచిన కాలంలో జైనులు, పార్శీలు జనాభా తగ్గిందని పేర్కొంది. భారత్ చుట్టు పక్కల ఉన్న మిత్ర దేశాల్లో పరిస్థితుల గురించీ ఈ రిపోర్ట్‌లో వివరాలు ఉన్నాయి. మయన్మార్‌లో ఈ జనాభా పది శాతం మేర తగ్గింది. అలాగే నేపాల్‌లో హిందూ జనాభా సైతం 3.6 శాతం తగ్గింది.