జనసేనాని కోసం మరో టాలీవుడ్ స్టార్ హీరో మద్దతు తెలిపారు. నేచురల్ స్టార్ నాని ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. మీ పోరాటంలో గెలవాలి అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుంది.
Nani: జనసేన అధ్యక్షడు పవన్ కల్యాణ్‌కు మరో టాలీవుడ్ స్టార్ మద్దతు ప్రకటించారు. నేచురల్ స్టార్ నాని పవన్‌కు మద్దతు తెలుపుతు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. మీరు చేస్తున్న అతి పెద్ద యుద్ధంలో గెలవాలని, సినిమా కుటుంబం తరుఫున మద్దతు పలుకుతున్నట్లు నాని పోస్టులో పేర్కొన్నారు. ప్రజలకోసం రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ ఆశయాలు అన్ని నెరవేరాలని అని ఆకాంక్షిస్తున్నట్లలు నాని ఆయన పోస్టులో వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీ కూడా ఆయనకు మద్దతు ఇస్తుందని.. ఈ ఎన్నికల్లో గెలవాలని ఆల్ ది బెస్ట్ చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇప్పటికే పవన్ కోసం వరుణ్ తేజ్, హీరో సాయి దుర్గ తేజ్ ప్రచారం నిర్విహించాారు. మెగాస్టార్ చిరంజీవి సైతం ఓ వీడియో రూపంలో పిఠాపురం ఓటర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు. పవన్ కల్యాణ్‌ను గెలిపించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు ఎన్నో రోజుల సమయం లేదు. లోక్ సభ షెడ్యూల్లో భాగంగా నాలుగవ దశలో ఎన్నికలు మే 13న జరగనున్నాయి.
చదవండి:Srileela: శ్రీలీలకు మరో భారీ ఆఫర్?
Dear @PawanKalyan gaaru as you are about to face the big battle of politics. As a member of your film family I hope you achieve everything you wish and keep all your promises. I am rooting for you and I am confident the entire fraternity is too. All the very best sir 🙏🏼