ATP: CM చంద్రబాబు నాయుడు సోమవారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. యాడికి మండలం వేములపాడు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుని, అక్కడ నుంచి పెండేకల్లు రిజర్వాయర్‌ను సందర్శిస్తారు. అనంతరం యాడికి మార్కెట్ యార్డులో నిర్వహించే ‘నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత’ 100 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని పలువురు అధికారులు తెలిపారు.