WhatsApp is a new feature. Now you can plan an event
WhatsApp: వాట్సప్ కమ్యూనిటీస్ కోసం ఈ మెస్సెజింగ్ యాప్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇకపై వాట్సప్కమ్యూనిటీలో ఉండేవారు ఈవెంట్ ప్లాన్ చేసుకొవచ్చు. దీని ద్వారా ముఖ్యమైన పార్టీలు మిస్ అవకుండా ఉంటుంది. స్నేహితులు, స్కూల్, కాలేజీ ఫ్రెండ్స్, మ్యారేజ్, బర్త్ డే పార్టీలకు వర్చువల్‌గా ఈవెంట్ ప్లాన్ చేయచ్చు. ఇంతముందు ఈ మెయిల్ ద్వారా ఇన్విటేషన్లు, ఈ-వైట్ సేవలులాగే ఈ ఫీచర్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎదైనా ఈవెంట్ క్రీయేట్ చేస్తే అది కమ్యూనిటీ గ్రూప్‌లో పిన్ చేయబడి ఉంటుంది. గ్రూప్ సభ్యులు ఎవరు మిస్ అవకుండా ఉంటుంది.
ఆసక్తి ఉన్నవారు దానిపై క్లిక్ చేస్తే అడ్మిన్‌కు ఎంత మంది ఇంట్రస్టెడ్ అని తెలుస్తుంది. దాన్ని బట్టి పార్టీ ప్లానింగ్ చేసుకోవచ్చు. అంతేకాదు టైమ్, లోకేషన్ తదితర వివరాలు కూడా అందులో యాడ్ చేసే వెసులబాటు ఉంటుంది. ఇక ఈవెంట్‌కు రిమైండర్ కూడా ఉంటుంది. దీన్ని మొదట కమ్యూనిటీ గ్రూప్స్ తీసుకొస్తున్నారు. ఆ తరువాత వాట్సప్ గ్రూప్స్‌కు సైతం తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. ఇదంత అడ్మిన్ హ్యాండిల్ చేసేలా ఉంటుంది. పనికి అంతరాయం కలగకుండా మ్యూట్ చేసుకోవచ్చు. అలాగే నోటిఫికేషన్ బార్లో చాటింగ్ కూడా చేసుకునేందుకు వీలుగా ఈ ఫీచర్ ఉంటుంది.