WhatsApp : నెంబర్ లేకపోయినా ఇక వాట్సాప్‌లో కాల్ చేసేయొచ్చట!
వాట్సాప్‌లో కాల్ చేయాలంటే ఆ నంబర్ తప్పకుండా మన కాంటాక్ట్ లిస్ట్‌లో ఉండాల్సిందే. అయితే ఇకపై అలా లేకపోయినా కొత్త నంబర్లకు వాట్సాప్ నుంచి కాల్ చేసుకునే సదుపాయం రానుంది.
WhatsApp has banned the accounts of 76 lakh Indians in a single month
WhatsApp In-App Dialer : మనలో చాలా మందికి వాట్సాప్ చూడకుండా ఆ రోజు ముగియదు. ఈ మెసేజింగ్ యాప్‌ని అంతలా మనం వాడేస్తున్నాం. అందుకే వినియోగదారులకు మరింత మంచి ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చేందుకు వాట్సాప్‌లో ఎప్పుడూ కొత్త కొత్త ఫీచర్లు పుట్టుకొస్తూనే ఉంటాయి. అందులో భాగంగానో ఓ కొత్త కాలింగ్ ఫీచర్ ఇప్పుడు అందుబాటులోకి వస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
వాట్సాప్‌లో(WHATSAPP) ఇప్పుడు ‘ఇన్ యాప్ డైలర్’ పేరుతో కొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తెస్తోంది. ప్రస్తుతం దీని బీటా వెర్షన్ 2.24.9.28 ఆండ్రాయిడ్‌లో అందుబాటులో ఉంది. ప్రయోగాత్మకంగా పరిశీలించిన తర్వాత దీన్ని త్వరలోనే వినియోగదారులు అందరికీ అందుబాటులోకి తెస్తామని వాట్సాప్ మాతృ సంస్థ మెటా చెబుతోంది.
కొత్తగా వచ్చే ఈ ఫీచర్‌తో ఇకపై మనం ట్రాకలర్(TRUECALLER), గూగుల్ డైలర్(GOOGLE DAILER) లాంటివి వాడకుండా నేరుగా కాల్స్ చేసేసుకోవచ్చు. పైగా ఇది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ని కలిగి ఉంది. దీంతో భద్రత విషయంలో ఆలోచించాల్సిన అవసరం లేదు. చాలా మంది వీడియో, ఆడియో కాల్స్‌ని వాట్సాప్ నుంచి చేయడానికే ఇష్టపడుతుంటారు. ఇక కాంటాక్ట్‌లో లేని నెంబర్లకు కూడా ఈ కొత్త ఫీచర్‌తో తేలికగా కాల్స్ చేసుకోవచ్చు.