బీఆర్ఎస్ పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం అని 24వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
KTR: బీఆర్ఎస్ పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం అని 24వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ మట్టిలో పుట్టిన ఇంటి పార్టీ, ఈ నేల మేలుకోరే పార్టీ బీఆర్ఎస్. రెపరెపలాడే గులాబీ పతాకం, తెలంగాణ ఎగరవేసిన జయకేతనం, పర పీడన చెర విడిపించిన ఉద్యమ జెండా, పసిడి కాంతులు పంచిన ఉజ్వల ప్రగతి బావుటా, పుట్టుకే ఒక సంచలనం, దారి పొడవునా రాజీలేని రణం, ఆత్మగౌరవ మెరుపులు, అభివృద్ధి పరిమళాలు అందుకున్న స్వీయ రాజకీయ పార్టీ అని, గులాబీ పార్టీ ప్రస్థానం అని తెలిపారు.
రెపరెపలాడే గులాబీ పతాకం తెలంగాణ ఎగరేసిన జయ కేతనం..!
తెలంగాణలో మట్టిలో పుట్టిన ఇంటిపార్టీ, సమరంలో, సంబురంలో కష్ట సుఖాలను కలబోసుకున్న అనుబంధం.. తెంచలేని తుంచలేని జన్మజన్మాల సంబంధం. మనమే తెలంగాణ దళం, మనమే తెలంగాణ గళం. జెండా మోసి.. జంగ్ చేసిన లక్షలాది కార్యకర్తలే బలం బలగం. కంటికి రెప్పలా పార్టీని కాపాడుకున్న మీ పట్టుదలకు, మీ శ్రమకు, మీ కృషికి సదా సలాం.. ఏమిచ్చి తీర్చుకోగలం మీ రుణం. భారత రాష్ట్ర సమితి కుటుంబ సభ్యులందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు.