SRD: సంగారెడ్డి మండలంలో తొలి సర్పంచ్ ఫలితం వెల్లడింది. సంగారెడ్డి మండలం ఇరిగిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి సుప్రియ విజయం సాధించింది. కాంగ్రెస్ బలపరిచిన లక్ష్మీపై గెలుపొందారు. దీంతో బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకున్నారు. తనను గెలిపించిన ప్రజలకు సుప్రియ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.