»Prabhas Donates 35 Lakhs To Telugu Film Directors Association Tfda Announces
Prabhas: 35 లక్షలు ఇచ్చిన ప్రభాస్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోను ప్రభాస్ మంచితనం గురించి ఎంత చెప్పినా తక్కువే. తాజాగా మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు రెబల్ స్టార్.
Prabhas donates 35 lakhs to Telugu Film Directors Association, TFDA announces
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం అన్నీ భారీ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. గతేడాది వచ్చిన సలార్ సినిమాతో హిట్ కొట్టిన ప్రభాస్.. త్వరలో కల్కి సినిమాతో రాబోతున్నాడు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం రాజాసాబ్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత సలార్ 2 షూటింగ్ స్టార్ట్ కానుంది. అలాగే.. ఈ ఇయర్ ఎండింగ్లో సందీప్ రెడ్డి వంగ ‘స్పిరిట్’ సెట్స్ పైకి వెళ్లనుంది. ఆ తర్వాత హనురాఘపూడితో వార్ బ్యాక్ డ్రాప్లో లవ్ స్టోరీ చేయనున్నాడు. ఇలా ఏ మాత్రం గ్యాప్ లేకుండా సినిమా చేస్తున్న డార్లింగ్.. ఎప్పటికప్పుడు మంచి మనసు చాటుకుంటునే ఉన్నాడు. ముఖ్యంగా.. ప్రభాస్ పెట్టే భోజనం గురించి ఎంతోమంది హీరోలు, హీరోయిన్స్, సెలబ్రిటీలు మాట్లాడుతూనే ఉంటారు.
అలాగే.. ప్రభాస్ ఎంతోమందికి సహాయం చేస్తూ ఉంటాడు. గతంలో డొనేషన్స్ కూడా ఇచ్చాడు. తాజాగా ప్రభాస్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నాడు. తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్‌కు 35 లక్షల విరాళం ఇచ్చినట్లు టీఎఫ్‌డీఏ ప్రకటించింది. దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు జన్మదినం సందర్భంగా ప్రతి ఏటా నిర్వహిస్తున్న డైరెక్టర్స్ డేని.. ఈసారి కూడా ఘనంగా నిర్వహించబోతున్నారు. మే 4న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా.. తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ డే వేడుక నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ 35 లక్షల విరాళం ఇచ్చినట్లు.. దర్శకుడు మారుతి అసోసియేషన్ కార్యక్రమంలో తెలిపాడు. దీంతో ప్రభాస్ పై దర్శకుల సంఘంతో పాటు అభిమానులు అభినందనలు కురిపిస్తున్నారు.