Who is the real Ashwatthama? What is his curse? What is the relation with Kalki story?
Ashwatthama: కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్ తాజా టీజర్ విడుదలైంది. దాన్ని చూసిన చాలా మందికి ఒక డౌట్ వస్తోంది. ఆ టీజర్లో అశ్వత్థామ శివాలంలో పూజ చేసుకుంటూ ఉంటాడు. శివలింగంపై నీటి చుక్కలు పడుతుంటాయి. అదే సమయంలో అక్కడికి ఒక బాలుడు వచ్చి నువ్వు ఎవరు అని, నీ ఒంటిపై ఆ గాయాలు ఏంటి, నిన్ను ఏమని పిలువాలి, ఏ భాషాలో అడిగితే అర్థం అవుతుంది, నీకు మరణం లేదా, నువ్వు దేవిడివా అని కూడా అడుగుతాడు. అదే సమయంలో శివలింగంపై నీటి చుక్కలు పడటం ఆగిపోతుంది. అప్పుడు అక్కడ నుంచి లేచిన అశ్వత్థామ ఇప్పుడు సమయం వచ్చిందని తాను ద్వాపర యుగం నుంచి దశావతారం కోసం ఎదురు చూస్తున్నా. ద్రోణాచార్య తనయుడు అశ్వత్థామని అంటాడు. అశ్వత్థామ అంకుల్ వైయిట్ ఫర్ మీ అని బాలుడు అనడంతో టీజర్ అయిపోతుంది. అయితే ఇక్కడే చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే.. అసలు అశ్వత్థామ ఎవరు? ద్వాపర యుగం నుంచి ఎవరికోసం ఎదురు చూస్తున్నారు? శ్రీకృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి? ఆయన పాండవులకు చేసిన ద్రోహం ఏంటి? అని గూగుల్లో తెగ వెతుకుతున్నారు.
మహాభారతంలో పాండవుల, కౌరవుల గురువు ద్రోణాచార్యుని కుమారుడు అశ్వత్థామ. సప్త చిరంజీవుల్లో ఒకడు, అశ్వత్థమ అమరుడు. సప్త చిరంజీవులు అశ్వత్థామ, బలిచక్రవర్తి, వ్యాస మహర్షి, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు అని మనకు తెలుసు. ద్రోణుడు, కృపి దంపతుల కుమారుడు అశ్వత్థామ. ద్రోణుడి తపస్సుకు మెచ్చిన శివుడి, ఆయన అంశతో నుదిటిపై మణితో జన్మిస్తాడు. ఆ మణి వలన అందరిలా ఆకలి, దాహా, గాయాలు, బాధలు ఉండవు. తండ్రి ద్రోణుడి పర్యవేక్షణలో అర్జునుడితో సమానమైన విలువిద్యను అభ్యసిస్తాడు. పొగిడితే పడిపోయే స్వభావం ఉన్నవాడు. అందుకే ఆయన కౌరవులకు సన్నిహితంగా ఉంటాడు.
కురుక్షేత్రం సంగ్రామం సమయంలో ద్రోణుడు సైతం కౌరవుల పక్షాన యుద్ధం చేయాల్సి వస్తుంది. రణరంగంలో ద్రోణుడిని ఓడించడం అసాధ్యం అని అందరికీ తెలుసు. అందుకే ధర్మరాజు చేత శ్రీకృష్ణుడు ఓ పన్నాగం పన్నుతాడు. అసత్యం అంటే తెలియని ధర్మరాజు చేత అశ్వత్థామ హతః కుంజరః అనే వ్యాఖ్యాన్ని చెప్పిస్తాడు. అప్పటి వరకు పాండవుల మీద విరుచుకుపడుతున్న ద్రోణుడు ఆ మాటలతో అస్త్ర సన్యాసం చేస్తాడు. అదే సమయంలో దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడి వెన్నులో విల్లును దింపుతాడు. విషయం తెలిసిన అశ్వత్థామా చివరి క్షణాల్లో తండ్రి ద్రోణుడిని కలుస్తాడు. దృష్టద్యుమ్నుడు చంపేస్తానని మాట ఇస్తాడు.
పగతో రగిలిపోతున్న అశ్వత్థామ యుద్ధం తరువాత పాండవులను మట్టుబెడుతా అని దుర్యోధనుడి మరణానికి ముందు మాట ఇస్తాడు. అశ్వత్ధామకు శివుని అనుగ్రహం ఉంది. ఇక యుద్ధం చివరి రోజున పాండవులను చంపడానికి రాత్రి సమయంలో వారి శిబిరాలపై దాడికి పూనుకుంటాడు. అశ్వత్థామ కృతవర్మ, కృపాచార్యునితో శిబిరానికి వెళ్తాడు. విషయం గ్రహించిన శ్రీకృష్ణుడు పాండవులను గంగానది తీరానికి తరలిస్తాడు. శిభిరానికి చేరుకున్న అశ్వత్థామ కోపంతో ఉప పాండవులు అయిన ద్రౌపది పుత్రులైన ఐదు మంది ఉపపాండవులను చంపేస్తాడు. విషయం తెలుసుకున్న పాండవులు అశ్వత్థామను వెంబడిస్తారు. వ్యాసాశ్రమంలో పాండవులకు అశ్వత్థామా ఎదురుపడుతాడు. అర్జునుడితో యుద్ధానికి పూనుకుంటాడు.
కోపంతో రగిలిపోతున్న అశ్వత్థామ ఆయన తండ్రి ప్రసాందించిన బ్రహ్మ అస్త్రాన్ని పాండవ సంతతి ఈ భూమి మీద బతకడానికి వీలు లేదు అని మంత్రించి బాణాన్ని ప్రయోగిస్తాడు. అతన్ని ఎదర్కోవాలంటే మళ్లీ బ్రహ్మాస్త్రమే వేయాలి. అప్పటికే తపస్సు ద్వారా పొందిన అర్జునుడు బ్రహ్మస్త్రాన్ని ప్రయోగిస్తాడు. రెండు మహా అస్త్రాలు తలబడితే ప్రళయం వస్తుందని గ్రహించిన వ్యాస మహర్షి, నారదుడు వచ్చి అస్త్రాలను ఉపసంహరించుకోవాల్సిందిగా కోరుతారు. పెద్దల మాట కాదనలేక అర్జునుడు తన అస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు. కానీ అశ్వత్థామ దుర్భుద్దితో దాన్ని ప్రయోగిస్తాడు. అయితే పాండవులు స్త్రీల గర్భాలపై దాన్ని ప్రయోగిస్తాడు. దాంతో ఉత్తర గర్భం విచ్ఛినమవుతుంది. ఈ ఘటనతో కోపం తెచ్చుకున్న శ్రీకృష్ణుడు అశ్వత్థామ తలపై ఉన్నసహజ మణిని తొలగించి శపిస్తాడు. కుష్టి వ్యాధితో, ఆకలితో 3 వేల సంవత్సరాలు ఈ భూమి మీదే తిరుగు అని శపిస్తాడు. తరువాత శ్రీ కృష్ణుడు తన శక్తులతో ఉత్తర కడుపలోని పరీక్షిత్ ను కాపాడుతాడు. ఇది అశ్వత్థామ కథ.
అయితే ఈ కథను కల్కి చిత్రానికి ఎలా ముడిపెట్టారో చూడాల్సి ఉంది. శ్రీ మహా విష్ణువు పదవ అవతారమే భైరవనా, ఈ ప్రపంచాన్ని కాపడానికి భైరవ జన్మించాడా? మరీ ఈ ప్రపంచానికి ఎలాంటి ఆపద రాబోతుంది. దాన్ని భైరవ ఏ విధంగా రక్షిస్తాడు. అతనికి అశ్వత్థామ సాయపడుతాడా? శాపం తొలగిపోతుందా అనేది సినిమాలో చూడాల్సిందే.