»Bjps Mukesh Dalal Is Unanimous Congress Candidate Nilesh Kumbhani Is Missing In Surat
BJP: బీజేపీ ఏకగ్రీవం.. సూరత్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మిస్సింగ్
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజీపీ ఏకగ్రీవం అయిన విషయం తెలిసిందే. అక్కడ కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్న నీలేష్ కుంభాని కనిపించకుండా పోవడంతో అక్కడ పార్టీ శ్రేణులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
BJP's Mukesh Dalal is unanimous. Congress candidate Nilesh Kumbhani is missing in Surat.
BJP: గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ముఖేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ఖారారు చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి కనిపించకుండా పోవడం స్థానికంగా సంచలనంగా మారింది. ఆయన ఫోన్ కూడా అందుబాటులో లేదని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయంపై దేశమంతా చర్చ కొనసాగుతుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు నీలేష్ కుంభాని ఇంటికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండడం, కుటుంబ సభ్యులు అందరూ పారారీ కావడంతో ఇదీ పక్కా ప్లాని అని నిర్ధారించుకున్నారు.
దీంతో ఆగ్రంతో ఉన్న కాంగ్రెస్ శ్రేణులు ప్రజాద్రోహి అనే ప్లకార్డులు ఇంటి ముందు ప్రదర్శించారు. సూరత్ ఏకగ్రీవంపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఎన్నికను రద్దు చేయాలని అభ్యర్థించింది. మళ్లీ ఎన్నిక నిర్వహించాలని కోరినట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ తెలిపారు. సూరత్‌లో ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థుల పత్రాలు సరిగా లేవని అధికారులు వారి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారు. మరో 8 మంది అభ్యర్థులు తమ దరఖాస్తులను ఉపసంహరించుకున్నారు. దీంతో ఆ స్థానంలో పోటీ ఎవరు లేరని బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్‌ను ఏకగ్రీవం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కావాలనే కుంభాని మోసం చేసినట్లు పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఆయన త్వరలోనే బీజేపీలోకి చేరబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.