KMM: స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం నివాళి తెలిపారు. “అణగారిన వర్గాలకు ఆశాకిరణం. సామాజిక పోరాటాలకు మార్గదర్శకం. సమానత్వం కోసం పాటుపడిన వ్యక్తి జగ్జీవన్ రామ్” అని అన్నారు. ఆయన ప్రజా ప్రతినిధిగా చేసిన సేవలు మరువలేనివని మంత్రి పేర్కొన్నారు.