Game changer: గేమ్ చేంజర్.. ఇది సినిమాకే హైలెట్?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ ఈ సినిమా అనుకున్న సమయానికి పూర్తి కాలేకపోతోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్‌గా మారింది.
Game changer.. Is this the highlight of the movie?
Game changer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్లో 50వ సినిమాగా.. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే కీలక షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న గేమ్ ఛేంజర్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా గేమ్ ఛేంజర్ కొత్త షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ అయింది. రామోజీ ఫిల్మ్ సిటీలో వారం రోజుల పాటు షూటింగ్ ప్లాన్ చేశారు మేకర్స్. ఈ షెడ్యూల్లో చరణ్‌తో పాటు ఇతర తారాగణం కూడా పాల్గొంటున్నారు. రామ్ చరణ్ పై ఓ మాంటేజ్ సాంగ్ షూట్ చేస్తున్నారట.
ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్లో నటిస్తున్నాడు. ఈ మాంటేజ్ సాంగ్‌లో చరణ్ రెండో పాత్ర తాలుకూ గ్రాఫ్‌ను చూపించనున్నారట. కథ ప్రకారం ఈ మాంటేజ్ సాంగ్ సినిమాలో చాలా కీలకం అని తెలుస్తోంది. ఈ పాట ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే చరణ్ సీనియర్ పాత్ర పై ఉంటుందని టాక్. ఇప్పటికే గేమ్ చేంజర్ నుంచి రిలీజ్ పోస్టర్స్, జరగండి సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్‌కు మంచి రెస్సాన్స్ వచ్చింది. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. దీంతో మ్యూజికల్ ఆల్బమ్ పై భారీ అంచనాలున్నాయి. మామూలుగానే శంకర్ సినిమాల్లో పాటలు ఓ రేంజ్లో ఉంటాయి. జరగండి సాంగ్ కూడా సెటప్ పరంగా అదిరిపోయింది. ఇక ఇప్పుడు షూట్ చేస్తున్న మాంటేజ్ సాంగ్ కూడా మామూలుగా ఉండదని అంటున్నారు. మరి ఈ సినిమాతో చరణ్‌కు శంకర్ ఎలాంటి హిట్ అందిస్తాడో చూడాలి.