Doordarshan Logo: Controversial new color of Doordarshan
Doordarshan Logo: గతంలో దూరదర్శన్ లోగో ఎరుపు రంగులో ఉండేది. అయితే ప్రస్తుతం దీనిని ఆరెంజ్ రంగుకు మార్చారు. దీంతో ఈ లోగోపై వివాదం చెలరేగుతున్నది. దూరదర్శన్‌కు చెందిన డీడీ న్యూస్ ఇంగ్లీష్ ఛానల్. అయితే ఇది కొత్త రంగులో ఉన్న లోగోను తెలుపుతూ.. విలువలు అలాగే ఉన్నాయని, కానీ మేం ఇప్పుడు కొత్త అవతారంలో దర్శనం ఇస్తున్నమని, గతంలో ఎన్నడూ లేని రీతిలో వార్తా ప్రయాణానికి స్వాగతం అని, డీడీ న్యూస్‌ను కొత్తగా ఫీల్ అవ్వండని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తృణమూల్ ఎంపీ జవహర్ సిర్‌చర్ లోగో రంగుపై విమర్శలు చేశారు.
లోగో రంగు తగిన విధంగా లేదని, రంగును కాషాయంలోకి మార్చడం చాలా బాధగా ఉందన్నారు. ఇది ప్రసార భారతి కాదని.. ప్రచార భారతిగా మారిందని విమర్శించారు. ప్రసార భారతి సీఈవోగా సిర్‌చర్ గతంలో బాధ్యతలు నిర్వర్తించారు. లోగోకు కొత్త రంగు వేయడం ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు అవుతుందని ఆయన ఆరోపించారు. సిర్‌చర్ వ్యాఖ్యలను ప్రస్తుత సీఈవో ఖండించారు. విజువల్ ఈస్థటిక్స్, ఛానల్ బ్రాండింగ్ ఆధారంగా కలర్‌ను ఎంపిక చేశామని తెలిపారు. లోగో ఒక్కటే కాదు.. డీడీ ఛానల్ లుక్, ఫీల్‌ను కూడా అప్‌గ్రేడ్ చేశామని తెలిపారు.