»Dubai Helpline Numbers For Stranded Indians In Dubai
Dubai: దుబాయ్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు
భారీ వర్షాల కారణంగా యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అతలాకుతలం అయ్యింది. 75 ఏళ్లలో ఎప్పుడూ నమోదు కానంత వర్షపాతం నమోదయ్యింది. దీంతో ఎక్కడిక్కడ అన్ని స్తంభించిపోయాయి. అయితే అక్కడ చిక్కుకున్న భారత పౌరులు సాయం కోసం కాల్ చేయడానికి కొన్ని హెల్ప్‌లైన్ నంబర్లను తీసుకొచ్చింది.
Dubai: Helpline numbers for stranded Indians in Dubai
Dubai: భారీ వర్షాల కారణంగా యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అతలాకుతలం అయ్యింది. 75 ఏళ్లలో ఎప్పుడూ నమోదు కానంత వర్షపాతం నమోదయ్యింది. దీంతో ఎక్కడిక్కడ అన్ని స్తంభించిపోయాయి. ఎల్లప్పుడూ రద్దీగా ఉండే దుబాయ్ ఎయిర్‌పోర్లులో నీరు నిలిచిపోయింది. దీంతో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఎంతోమంది ప్రయాణికులు ఎయిర్పోర్లుల్లోనే పడిగాపులు కాస్తున్నారు. ఈక్రమంలోనే నగరంలోని చిక్కుకుపోయిన భారతీయుల కోసం అక్కడ దౌత్య కార్యాలయం హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల చేసింది.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో దుబాయ్, ఉత్తర ఎమిరేట్స్ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన భారత పౌరులు సాయం కోసం +971501205172, +971569950590, +971507347676, +971585754213 నంబర్లకు ఫోన్ చేయాలని వెల్లడించింది. ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయిన ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించేందుకు యూఏఈ అధికారులతో అనుసంధానం అయినట్లు తెలిపింది. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేంతవరకు ఈ హెల్ప్‌లైన్ నంబర్లు కొనసాగుతాయని తెలిపింది.