రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో గుజరాత్ ఓటమి పాలైంది. 210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన GT కేవలం 6 పరుగల తేడాతో ఓడింది. సాయి సుదర్శన్(73) హాఫ్ సెంచరీతో అదరగొట్టినప్పటికీ అతడి శ్రమ వృధా అయింది. చివర్లో వచ్చిన రషీద్ ఖాన్, రబడా శ్రమించినా ఓటమి తప్పలేదు. RR బౌలర్లు బిష్ణోయ్ 4 వికెట్లు పడగొట్టగా.. బర్గర్, రియాన్ పరాగ్ తలో వికెట్ తీశారు.