»Viral Post Amma Baboy Play School Fee Lakhs A Fathers Post Is Going Viral
Viral Post: అమ్మ బాబోయ్ ప్లే స్కూల్ ఫీజ్ లక్షలా!.. వైరల్ అవుతున్న ఓ తండ్రి పోస్ట్
చాలామంది తల్లిదండ్రులు వాళ్ల పిల్లలను లక్షలు పెట్టి మరి చదివిస్తున్నారు. వచ్చే జీతం కంటే పిల్లల చదువుల ఖర్చు ఎక్కువ ఉన్నా చదివిస్తుంటారు. అయితే ఇటీవల ఓ తండ్రి తన బిడ్డ ప్లే స్కూల్ ఫీజు ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral Post: ప్రతిఒక్కరికి చదువు అవసరమే. చదువుకుంటే జీవితంలో ఉన్నత స్థితికి వెళ్తారని చాలామంది తల్లిదండ్రులు వాళ్ల పిల్లలను లక్షలు పెట్టి మరి చదివిస్తున్నారు. వచ్చే జీతం కంటే పిల్లల చదువుల ఖర్చు ఎక్కువ ఉన్నా చదివిస్తుంటారు. అయితే తల్లిదండ్రుల ఆలోచనలను అడ్డుపెట్టుకుని కొన్ని ప్రైవేట్ సంస్థలు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు మనకు సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. అయితే ఇటీవల ఓ తండ్రి పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
My son's Playschool fee is more than my entire education expense 🙂
ఢిల్లీకి చెందిన ఆకాశ్ కుమార్ ఓ ప్రైవేట్ ఉద్యోగి. తన కుమారుడి ప్లే స్కూల్ ఫీజు సంవత్సరానికి ఎంత చెల్లించాడో రిసిప్ట్తో సహా వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్లే స్కూల్ ఫీజు చేస్తే మీరు షాక్ కావాల్సిందే. ప్లే స్కూల్ ఫీజులే ఇలా ఉంటే పిల్లలు పెద్దయ్యాక ఫీజులు ఎలా ఉంటాయో అసలు చదివించుకోగలమా అని ఆ వ్యక్తి ఆవేదన చెందుతున్నాడు. ఆకాశ్ ఆ ప్లే స్కూల్లో రిజిస్ట్రేషన్ ఫీజు రూ.10 వేలు, వార్షిక ఫీజు రూ.25 వేలు కాగా.. టర్మ్-1(ఏప్రిల్-జూన్ 2024) రూ.98,750, టర్మ్-2 (జులై-సెప్టెంబర్ 2024) రూ.98,750, టర్మ్-3(అక్టోబర్-డిసెంబర్ 2024) రూ.98,750, టర్మ్-4(జనవరి-మార్చి 2025) రూ.98,750 ఉండగా.. మొత్తం రూ.4,30,000 అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.