»Patanjali Ceo Balakrishna And Ramdev Cannot Be Trusted Blindly Supreme Court
Supreme Court: గుడ్డిగా నమ్మలేము.. రాందేవ్‌పై సుప్రీం కోర్టు సీరియస్
పతంజలి యాడ్స్ కేసులో ధర్మాసనం ముందు హాజరైన బాబా రాందేవ్, బాలకృష్ణలను మరోసారి మందలించింది. వారు క్షమాపణ చెప్పినప్పటికీ మిమ్మల్ని నమ్మలేము, మీరెమన్న అమయకులా అని నిలదీసింది.
Patanjali CEO Balakrishna and Ramdev cannot be trusted blindly.. Supreme Court
Supreme Court: కోవిడ్ సమయంలో కరోని పేరిట మందులు తయారు చేసి విక్రయించడమే కాకుండా ఆధునిక వైద్యాన్ని సైతం అబాసుపాలు చేస్తూ పతంజలి సంస్థ యాడ్స్ చేసింది. ఈ విషయంలో బాబా రాందేవ్, బాలకృష్ణలు కోర్టు కేసు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈరోజు సుప్రీంకోర్టు(Supreme Court) ధర్మాసనం వారిని విచారించింది. గత వారం కూడా హాజరయ్యారు. అయితే వీరిపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఈ రోజు ధర్మాసనం సభ్యులు జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అమానుల్లా సైతం వారిపై కొప్పడ్డారు. బాబా రాందేవ్ అంటే యోగా గురువు అని ఆ విషయంలో మీరు ఎంతో సేవ చేశారు అందుకు గౌరవిస్తున్నామని బెంచ్ పేర్కొంది. అయితే ఇలా తప్పుడు యాడ్స్ చేయడంపై విచారణ వ్యక్తం చేశారు. దీనిపై వారు స్పందిస్తూ.. బహిరంగంగా క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని, కోర్టు ప్రతిష్టను దిగజార్చడం తమ ఉద్దేశం కాదని పేర్కొన్నారు.
దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. మీరు క్షమాపణ చెప్పడం ఓకే అని ఆయుర్వేద గొప్పతనం గురించి వివరించాలంటే పోటీగా ఉన్న వైద్య విధానాలను ఎందుకు తప్పు అన్నారు అని ధర్మాసనం ప్రశ్నించింది. చట్టం అందరికీ ఒక్కటే అని జస్టిస్ అమానుల్లా తెలిపారు. దీనిపై బాబా రాందేవ్ బదులిస్తూ.. భవిష్యత్తులో జాగ్రత్తగా వహిస్తామని అన్నారు. దాంతో ఆగ్రహించిన ధర్మాసనం మిమ్మిల్ని క్షమిస్తామని చెప్పడం లేదు, మీ గురించి తెలసి, మీ చరిత్ర తెలసి మిమ్మల్ని గుడ్డిగా నమ్మలేమని ధర్మాసనం చెప్పింది. అయితే మీరు చెప్పిన క్షమాపణ గురించి ఆలోచిస్తామని, మీరేమీ అమాయకులు కాదు అని, కోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందో మీకు తెలుసన్నారు. అయితే మీరు చేసింది ముమ్మాటికి తప్పేనని తేల్చిచెప్పారు. మళ్లీ ఏప్రిల్ 23 న విచారణకు వాయిదా వేశారు.