బాలకృష్ణ హోస్ట్‌గా ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా… అన్‌స్టాపబుల్ టాక్ షోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం అభిమానులు, ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ ఎపిసోడ్ నేడు రాత్రి 9 గంటలకు స్ట్రీమింగ్ కానుంది. ప్రోమోలు అన్నీ కూడా బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్ అనేవిధంగా అదరగొట్టాయి. ఇప్పటికే ప్రభాస్ ఎపిసోడ్‌కు సర్వర్ క్రాష్ సమస్యను ఎదుర్కొంది. పవన్ ఎపిసోడ్ నేపథ్యంలో ఆహా టీమ్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ ప్రారంభించిన గంటల్లోనే లక్షల సంఖ్యలో యూజర్ ట్రాఫిక్ ఉంటుందనే అంచనాలతో ఆహా టీమ్ ఉన్నది. అందుకు అనుగుణంగా ట్రాఫిక్ థ్రెష్-హోల్డ్లను మెరుగు పరుస్తున్నారు. యూజర్ ట్రీఫిక్ 2 మిలియన్లు దాటినా కూడా క్రాష్ కాకుండా ఉండేందుకు బ్యాకప్ సర్వర్లను ఇన్స్టాల్ చేశారని తెలుస్తోంది. కేవలం పవన్ టాక్ షో చూడడానికే చాలామంది ఆహా సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు.
పవన్ టాక్ షో నేపథ్యంలో ఆహా వీడియోస్ ట్విట్టర్ హ్యాండిల్ ట్వీట్ చేస్తున్న వీడియోలు ఆసక్తిని రేపుతున్నాయి. ‘పవర్ ఫ్యాన్సూ… మీరు రెడీయేనా? మరో 12 గంటలు మాత్రమే ఉంది’ అంటూ ఆహా అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ సర్వర్ సమస్య ఉండదని చెప్పే ప్రయత్నం చేసింది. ఇందుకు మగధీరలో రామ్ చరణ్‌ను సర్వర్‌గా పేర్కొంటూ… ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్.. 100 మందిని ఒకేసారి రమ్మను అంటూ.. సర్వర్ క్రాష్ కాకుండా మేం సిద్ధమంటూ చెప్పకనే చెప్పింది. రాత్రి తొమ్మిది గంటలకు సిద్ధంగా ఉండాలని చెబుతూ.. అందుకు అనుగుణంగా వివిధ సినిమాల్లోని క్లిప్స్‌ను ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేస్తోంది. సాయంకాలం… అంటూ నటుడు సునీల్… నీరు, బీరు, ఫుడ్‌తో సిద్ధమవుతున్నట్లుగా ఉన్న ఓ సినిమా సీన్‌ను కూడా పోస్ట్ చేసింది.