Bullet trains for East, North and South India too PM Modi
PM Modi: దేశంలో బుల్లెట్ రైల్లకు సంబంధించిన ప్రధాని గుడ్ న్యూస్ చెప్పారు. అహ్మదాబాద్-ముంబయి మార్గంలో బుల్లెట్ రైలు కారిడార్ పనులు షరవేగంగా జరుగుతున్నాయి పేర్కొన్నారు. ఉత్తర, దక్షిణ భారతదేశానికి కూడా బుల్లెట్ రైళ్లు రానున్నాయని, త్వరలోనే ఈ ప్రక్రియ మొదలు అవుతుందని సంకల్ప్ పత్ర పేరిట బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘‘అహ్మదాబాద్-ముంబయి బుల్లెట్ రైలు పనులు వేగంగా సాగుతున్నాయి. అదేవిధంగా తూర్పు, ఉత్తర, దక్షిణ భారత్కు ఒక్కోటి చొప్పున బుల్లెట్ రైలు రానుంది. ఇందుకు సంబంధించిన సర్వే పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి’ అని ప్రధాని తెలిపారు. అదేవిధంగా వందేభారత్ రైళ్ల సేవలను దేశంలోని ప్రతి మూలకు పొడిగిస్తామని చెప్పారు.