Jana Sena leader Naga Babu reacts to the incident of stone attack on CM Jagan
Naga Babu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై శనివారం రాత్రి రాయి దాడి జరిన విషయం తెలిసిందే. ఈ చర్యను ఖండిస్తూ అన్ని పార్టీల నాయకులు స్పందిస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు స్పందించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిని దాడి అప్రజాస్వామిక చర్య అని పేర్కొన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని వెల్లడించారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉండొచ్చు కానీ ఇలాంటి భౌతికమైన దాడులు హేయమైన చర్య అని, చట్టరీత్యా నేరమన్నారు. దీనిపై విచారణ జరిపించాలని, ఈ ఘటనకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఆయన అధికారిక ఎక్స్ వేదికగా స్పందించారు.
చదవండి:Salman Khan: సల్మాన్‌ఖాన్ ఇంటి వద్ద కాల్పులు కలకలం
విజయవాడలోని మేమంతా సిద్దం బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ సింగ్ నగర్ ఈ దాడి జరిగింది. ప్రసంగిస్తున్న జగన్‌పై ఓ అగంతకుడు రాయిని విసిరాడు. అది జగన్ ఎడమ కంటి పైభాగంలో తాకి స్వల్పంగా గాయం అయింది. వెంటనే స్పందించిన వ్యక్తిగత వైద్యులు బస్సులోనే చికిత్స అందించారు. అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి ఆయన చేరారు. ఎన్నికల ప్రచారంలో ఇలాంటి ఘటనలు చాలా దారుణం అని అన్ని రాజకీయ పార్టీల నాయకులు స్పందిస్తున్నారు. ఎన్నికల ముందు ఇలాంటి ఘటనలకు తావియ్యకుండా ఈసీ తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.