Harish Rao: బీజేపీ పదేళ్లు అధికారంలో ఉన్న చేసిందేమి లేదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రజలను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పాలని దౌల్తాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని రూ.2 లక్షల రుణమాఫీ ఏమైందని, రైతు భరోసా, వడ్లకు రూ.500 బోనస్ ఏమైందని హరీశ్ రావు కాంగ్రెస్ సర్కార్‌ను ప్రశ్నించారు. మహాలక్ష్మి ద్వారా రూ.2500, నిరుద్యోగ భృతి కూడా మోసం చేశారని హరీశ్ రావు అన్నారు. జాయింట్ కలెక్టర్, కలెక్టర్‌గా పనిచేసిన పీ వెంకట్రామరెడ్డి అందరికీ తెలిసిన వ్యక్తే అని, ఇక్కడి అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారన్నారు.