»Atishi Aap Leader Who Made Sensational Comments Against Bjp
Atishi: బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆప్ నేత
ఆప్ నేత, ఢిల్లీ మంత్రి ఆతిశీ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో దేశ రాజధానిలో రాష్ట్రపతి పాలన విధించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని అన్నారు.
Atishi: ఆప్ నేత, ఢిల్లీ మంత్రి ఆతిశీ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో దేశ రాజధానిలో రాష్ట్రపతి పాలన విధించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర జరుగుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేజ్రీవాల్‌ను తప్పుడు కేసులో అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని ప్రభుత్వాన్ని పడగొట్టేందుకే కుట్ర జరుగుతోందని ఆమె అన్నారు. చాలా విభాగాల్లో ఖాళీలు ఉన్నప్పటికీ అధికారులను కేటాయించడం లేదు. ఎన్నికల తేదీలు ప్రకటించినప్పటి నుంచి అధికారులు సమావేశాలకు హాజరు కావడం మానేశారు. ఇందులో భాగంగానే సీఎం వ్యక్తిగత కార్యదర్శిని కూడా పదవి నుంచి తొలగించారని ఆమె ఆరోపించారు.
ఈ ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. ఆ పార్టీ ప్రతిరోజు కొన్ని అందమైన కథల్ని వండి వార్చుతుందని ఎద్దేవా చేసింది. ఇదిలా ఉంటే.. మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయి జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అవినీతి ఆరోపణలు చేస్తూ ఒక మంత్రి రాజీనామా చేశారు. ఇక సీఎం పీఎస్ వైభవ్ కుమార్‌ను విధుల నుంచి తొలగించారు. అతడి నియామక ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఢిల్లీ ప్రభుత్వ విజిలెన్స్ విభాగం ప్రకటించింది.