»Vijay Vijays Shocking Remuneration Is This The Last Movie
Vijay: విజయ్ షాకింగ్ రెమ్యూనరేషన్? ఇదే చివరి సినిమా?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్‌కి తమిళ్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే.. లేటెస్ట్గా విజయ్ రెమ్యూనరేషన్ ఒకటి హాట్ టాపిక్‌గా మారింది. ఏకంగా అన్ని కోట్లు అనేసరికి అంతా షాక్ అవుతున్నారు.
Vijay: ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో.. ఏ హీరో భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు? అంటే, ముందుగా ప్రభాస్ పేరు చెబుతున్నారు. ఒక్కో సినిమాకు వంద నుంచి 150 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నాడు ప్రభాస్. అయితే.. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మాత్రం ఏకంగా 250 కోట్లు రెమ్యూనరేషన్ అనేది హాట్ టాపిక్‌గా మారింది. తమిళ్లో సూపర్ స్టార్ రజనీ కాంత్ తర్వాత భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా విజయ్ క్రేజ్ ఉంది.
అయితే.. ఇప్పటికే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేసిన విజయ్.. ఒకటి, రెండు సినిమాల తర్వాత రాజకీయం పై ఫుల్ ఫోకస్ పెట్టనున్నాడు. దీంతో.. ఇప్పుడు విజయ్ చేస్తున్న, చేయబోయే సినిమాలకు ఓ రేంజ్లో డిమాండ్ చేస్తున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం గోట్ సినిమా చేస్తున్న విజయ్.. నెక్స్ట్ తన 69వ సినిమాను హెచ్.వినోద్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ సినిమాను తెలుగు నిర్మాత డివివి దానయ్య నిర్మించనున్నట్టుగా టాక్ నడుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందట. ఈ సినిమాకే విజయ్ 250 కోట్ల రేంజ్లో రెమ్యునరేషన్ తీసుకోబుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇప్పటికే గోట్ సినిమాకు 150 కోట్లు అందుకుంటున్నట్లుగా టాక్ ఉంది. ఇక ఇప్పుడు అంతకుమించి అనేలా.. ఏకంగా 250 కోట్లని అంటున్నారు. దీనికి కారణం కూడా లేకపోలేదని అంటున్నారు. ఇది విజయ్ చివరి సినిమా కావడం వల్లే ఈ రేంజ్ రెమ్యూనరేషన్ అని సమాచారం. ఎందుకంటే.. విజయ్ లాస్ట్ సినిమా అంటే, బిజినెస్ లెక్కలు భారీగా ఉంటాయి. అందుకే అడిగినంత ఇస్తున్నారని టాక్. మరి ఇందులో నిజమెంతో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.