TG: హైదరాబాద్ నగర వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు వర్షం కురిసింది. అయితే రాబోయే కొన్ని గంటల్లో నగరవ్యాప్తంగా మళ్లీ తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావొద్దని అధికారులు సూచనలు చేశారు. కాగా, రాత్రి కురిసిన వర్షానికి పలుచోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది.