»April Fools Day How Did April Fools Day Come About
April Fools Day: ఫూల్స్ డే ఎలా వచ్చిందంటే?
ఏప్రిల్ 1న ప్రపంచవ్యాప్తంగా ఫూల్స్ డే జరుపుకుంటారు. సరదాగా స్నేహితులతో గడపడం, జోక్స్ వేసుకోవడం వంటివన్నీ ఈ రోజు చేస్తుంటారు. అసలు ఈ ఫూల్స్ డే ఎలా వచ్చిందనే విషయం మాత్రం చాలామందికి తెలియదు. మరి ఆ ఫూల్స్ డే ఎలా వచ్చింది? ఏప్రిల్ 1నే ఎందుకు ఫూల్స్ డే జరుపుకుంటారనే విషయాలు తెలుసుకుందాం.
April Fools Day: ఇంగ్లాండ్ రాజు రిచర్డ్ 2, బోహేమియా రాణితో నిశ్చితార్థాన్ని 1381లో ప్రకటించాడు. ఈ ఎంగేజ్మెంట్ డేట్ మార్చి 32వ తేదీగా తెలిపాడు. అయితే ప్రజలు ఈ తేదీని పట్టించుకోకుండా సంబరాలు చేసుకున్నారు. అయితే కొందరు అసలు క్యాలెండర్లో 32వ తేదీ లేదు కదా అని ఆలోచించారు. దీంతో అప్పటి నుంచి ఏప్రిల్ ఫూల్స్ డే మొదలైందని కొందరు అంటున్నారు. 1592లో జూలియన్ క్యాలెండర్ స్థానంలో జార్జియన్ క్యాలెండర్ ప్రవేశపెట్టారు.
అప్పటి నుంచి కొత్త సంవత్సరం మొదటి రోజును ఏప్రిల్ 1 నుంచి జనవరి 1కి మార్చారు. అయితే కొత్త క్యాలెండర్ అలవాటు పడక కొందరు మాత్రం ఏప్రిల్ ఒకటినే కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. దీంతో కొందరు ఏయ్.. ఏప్రిల్ ఫూల్స్ అని ఆట పట్టించారట. అప్పట్నుంచి ఏప్రిల్ ఒకటిన ఏప్రిల్ ఫూల్స్ అనటం కామన్ అయ్యిందని చెప్పుకుంటారు. అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ ఫూల్ డే సెలబ్రేట్ చేస్తున్నారు.