»Arvind Kejriwal Delhi Cm To Tihar Jail Judicial Remand For 15 Days
Arvind Kejriwal: తిహార్ జైలుకు ఢిల్లీ సీఎం.. 15 రోజులు జ్యుడీషియల్ రిమాండ్
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. కేజ్రీవాల్‌కు 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ రౌజ్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులిచ్చింది.
Arvind Kejriwal: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. కేజ్రీవాల్‌కు 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ రౌజ్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. దీంతో అతనిని తిహార్ జైలుకు తరలించనున్నారు. ఈ మద్యం కుంభకోణంలో కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. తర్వాత కోర్టులో హాజరుపర్చగా.. మొదట ఏడు రోజులు, ఆ తర్వాత నాలుగు రోజుల పాటు ఈడీ కస్డడీలోనే ఉన్నారు. ఈరోజుతో కస్టడీ ముగియడంతో కేజ్రీవాల్‌ను నేడు కోర్టు ఎదట హాజరుపర్చారు.
కస్డటీ పొడిగింపు కోరడం లేదని.. కేజ్రీవాల్‌ను జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని ఈడీ కోరింది. అతను సరిగ్గా విచారణకు సహకరించడం లేదని, ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదని ఈడీ తెలిపింది. డిజిటల్ పరికరాల పాస్వర్డ్లు కావాలనే చెప్పడం లేదని.. దర్యాప్తును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని.. కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఆయనను కస్టడీలోకి తీసుకుంటాం. అప్పటివరకు జ్యుడిషియల్ కస్టడీ విధించాలని ఈడీ తెలిపింది. దీంతో న్యాయస్థానం కేజ్రీవాల్‌కు జ్యుడిషియలర్ కస్టడీ విధించింది.