వాణిజ్య అవసరాల కోసం వాడే వంటగ్యాస్ వినియోగదారులకు శుభవార్త. ఎల్పీజీ సిలిండర్ ధరను దేశీయ చమురు సంస్థలు తగ్గించాయి. స్థానిక పన్నుల ఆధారంగా రాష్ట్రాలను బట్టి వీటి ధరల్లో మార్పులు ఉంటాయి.
LPG Price: వాణిజ్య అవసరాల కోసం వాడే వంటగ్యాస్ వినియోగదారులకు శుభవార్త. ఎల్పీజీ సిలిండర్ ధరను దేశీయ చమురు సంస్థలు తగ్గించాయి. ఢిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర రూ.30.50 తగ్గి, రూ.1,764.50కు చేరింది. రాష్ట్రాలను బట్టి ఈ తగ్గింపుల్లో మార్పులు ఉంటాయి. పట్నాలో అయితే ఒక్కో సిలిండర్‌పై రూ.33 వరకు తగ్గింది. హైదరాబాద్‌లో రూ.32.50 తగ్గి రూ.1.994.50కు, విశాఖపట్నంలో రూ.32 తగ్గి రూ.1,826.50కు చేరింది. అయితే ఈ కొత్త ధరలు ఈరోజు నుంచే అమల్లోకి రానున్నాయి.
మరోవైపు ఐదు కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ ధరను కూడా రూ.7.50 తగ్గించారు. స్థానిక పన్నుల ఆధారంగా రాష్ట్రాలను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయి. కాగా, గృహావసరాలకు వినియోగించే 14 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. గత నెల మహిళా దినోత్సవం సందర్భంగా గృహావసరాల గ్యాస్ సిలిండర్ ధర రూ.100 తగ్గించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అదే ధర కొనసాగుతోంది.