»Virat Kohli Runs Hilariously During Team Indias Net Session Fans Compare It To His Water Boy Role
Virat Kohli: ఫన్నీ రన్నింగ్..నెట్టింట వైరల్!
విరాట్ కోహ్లీ(Virat Kohli) మైదానం మధ్యలో వినూత్నంగా పరుగులు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో భాగంగా ఇది చోటుచేసుకుంది.
Virat Kohli Runs Hilariously During Team India's Net Session, Fans Compare It To His Water Boy Role
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మైదానంలోకి అడుగుపెడితే పరుగుల వరద కురిపిస్తూ ఉంటాడు. అయితే, మైదానంలో లేకుండా రెస్ట్ మోడ్ లో ఉన్నప్పుడు కూడా ఎంటర్ టైన్ చేయడానికి విరాట్ ముందుంటాడు. తాజాగా మరోసారి అలాంటి ప్రయత్నమే చేశాడు. క్రికెట్ ప్రపంచ కప్ 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రచార ప్రారంభానికి ముందు భారత జట్టు శిక్షణా సెషన్లో భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ నెట్స్‌లో తన ఫన్నీ రన్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు. తన ప్యాడ్లతో కోహ్లీ ఉల్లాసంగా పరిగెత్తాడు. కోహ్లీ ఇలా చేయడం మొదటిసారి ఏమీ కాదు. గతంలో కూడా ఇలా చేశాడు. అతను ‘వాటర్ బాయ్’ కనిపించినప్పుడు కూడా ఇలానే ఫన్నీగా పరిగెత్తాడు.
బంగ్లాదేశ్‌తో అసంపూర్తిగా జరిగిన ఆసియా కప్ 2023 సూపర్ 4 మ్యాచ్‌లో కూడా ఇదే విధంగా ఫన్నీగా పరిగెత్తడం విశేషం. నెట్స్‌లో జస్ప్రీత్ బుమ్రాతో కలిసి కోహ్లీ సరదాగా గడిపాడు. శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ కూడా వీడియోలో కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్(viral) గా మారింది. ఇదిలా ఉండగా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు ఆసియా కప్ టైటిల్ గెలిచిన భారత జట్టు..ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కూడా కైవసం చేసుకుంది. త్వరలోనే వరల్డ్ కప్ బరిలోకి దిగనుంది. మరి వరల్డ్ కప్ ని టీమిండియా గెలుస్తుందో లేదో చూడాలి మరి.