ADB: శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి తలంబ్రాలు బుకింగ్స్‌లో ఆదిలాబాద్ రీజియన్ కరీంనగర్ జోన్లో ప్రథమ స్థానంలోనూ, రాష్ట్ర వ్యాప్తంగా 4వ స్థానం వచ్చినట్లు కార్గో మేనేజర్ నారాయణ తెలిపారు. ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో మొత్తం 2,786 మంది భద్రాద్రి తలంబ్రాలను బుక్ చేసుకున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఆర్టీసీ సంస్థకు రూ. 4,20,686 ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు.