»Rangasthalam Combo Fix Announcement Today Intro Shoot Too
Ramcharan: ‘రంగస్థలం’ కాంబో ఫిక్స్.. ఆరోజే అనౌన్స్మెంట్.. ఇంట్రో కూడా షూట్!
మరోసారి రంగస్థలం కాంబో ఫిక్స్ అయిపోయిందా? అంటే, ఔననే సమాధానం సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. అంతేకాదు.. త్వరలోనే ఈ క్రేజీ కాంబినేషన్ అనౌన్స్మెంట్కు రెడీ అయినట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఎప్పుడు?
Ramcharan: ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబుతో ఆర్సీ 16 చేస్తున్నాడు. లేటెస్ట్గా ఈ సినిమా గ్రాండ్‌గా ఓపెనింగ్ కార్యక్రమం జరుపుకుంది. త్వరలోనే రెగ్యూలర్ షూట్‌కి వెళ్తున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ తర్వాత చరణ్ ఎవరితో సినిమా చేయబోతున్నాడనే విషయంలో క్లారిటీ లేదు. కానీ సుకుమార్- రామ్ చరణ్ కాంబో మాత్రం ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది. గతంలో ఈ ఇద్దరు చేసిన రంగస్థలం మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. చిట్టిబాబుగా చరణ్ పర్ఫార్మెన్స్ పీక్స్‌లో ఉంటుంది. దీంతో మరోసారి ఈ క్రేజీ కాంబో సినిమా చేయడానికి రెడీ అవుతోంది. గతంలో పుష్ప ప్రమోషన్స్‌లో భాగంగా.. నెక్ట్స్ చరణ్‌తో సినిమా ఉంటుందని చెప్పుకొచ్చాడు సుకుమార్. ఇక ఇప్పుడు ఈ కాంబో ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయిందని అంటున్నారు.
అంతేకాదు.. మార్చి 27న చరణ్ బర్త్ డే సందర్భంగా.. ఆర్సీ 17 అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతున్నట్టుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దీంతో ఈసారి చిట్టిబాబు 2.0 రేంజ్లో ఈ ప్రాజెక్ట్ ఉండే ఛాన్స్ ఉంది. అంతేకాదు.. ఇప్పటికే పవర్ ఫుల్ ఇంట్రో సీన్ కూడా షూట్ చేసి పెట్టాడు సుకుమార్. గతంలోనే ఈ న్యూస్ వైరల్ అయింది. ఆర్ఆర్ఆర్ రిలీజ్‌కు ముందే చరణ్‌తో ఇంట్రో సీన్ షూట్ చేశారని.. ఆ ఫుటేజీ దాదాపు 10 నిమిషాలు ఉంటుందనే టాక్ ఉంది. ఆర్ఆర్ఆర్ కోసం చరణ్ బాడీ ట్రాన్స్‌ఫార్మెషన్ చూసి.. ముందుగానే ఇంట్రో షూట్ చేశాడట సుకుమార్. మళ్లీ చరణ్ అదే ఫిట్‌నెస్‌లోకి వస్తే.. సుకుమార్ ప్రాజెక్ట్ ఉంటుందని అంటున్నారు. అయితే ప్రస్తుతం సుకుమార్ పుష్ప2తో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాతే చరణ్ ప్రాజెక్ట్ పై ఫోకస్ చేయనున్నాడు.