»Delhi Delhi Is The Most Polluted Capital In The World
Delhi: ప్రపంచంలోనే అత్యంత కలుషిత రాజధానిగా ఢిల్లీ
పట్టణీకరణ పెరగడంతో పాటు మరోవైపు కాలుష్యం కూడా పెరిగిపోతుంది. అయితే బీహార్‌లోని బెగుసరాయ్ ప్రపంచంలోనే అత్యంత కలుషిత మెట్రోపాలిటన్ ప్రాంతంగా అవతరించగా.. ఢిల్లీ అత్యంత పొల్యూషన్ రాజధాని నగరంగా అవతరించింది.
Delhi: పట్టణీకరణ పెరగడంతో పాటు మరోవైపు కాలుష్యం కూడా పెరిగిపోతుంది. అధిక వాహనాల వాడకం, ఇతర కారణాల వల్ల ప్రపంచంలోని చాలా దేశాల్లో కాలుష్యం ఎక్కువవుతుంది. అయితే బీహార్‌లోని బెగుసరాయ్ ప్రపంచంలోనే అత్యంత కలుషిత మెట్రోపాలిటన్ ప్రాంతంగా అవతరించగా.. ఢిల్లీ అత్యంత పొల్యూషన్ రాజధాని నగరంగా అవతరించింది. స్విస్ సంస్థ ఐక్యూఎయిర్ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023, వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023 ప్రకారం బంగ్లాదేశ్, పాకిస్థాన్ తర్వాత 134 దేశాలలో భారతదేశం మూడో స్థానంలో నిలిచింది.
2022లో భారతదేశం క్యూబిక్ మీటర్‌కు 53.3 మైక్రోగాముల సగటు పీఎం 2.5 గాఢతతో ఎనిమిదవ అత్యంత కలుషితమైన దేశంగా నిలిచింది. క్యూబిక్ మీటర్‌కు సగటున 118.9 మైక్రోగ్రాముల పీఎం 2.5 గాఢతతో బెగుసరాయ్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత కలుషితమైన మెట్రోపాలిటన్ ప్రాంతంగా నిలిచింది. ల్లీలో పీఎం 2.5 స్థాయిలు 2022లో క్యూబిక్ మీటర్ కు 89.1 మైక్రోగ్రాముల నుంచి 2023 నాటికి క్యూబిక్ మీటర్‌కు 92.7 మైక్రోగ్రాములకు పెరిగాయి. 2018 నుంచి ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధాని నగరంగా నాలుగు సార్లు దేశ రాజధాని నిలిచింది.