»Horoscope Today Todays Horoscope 2024 March 19th Gods Strength Is Protecting
Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 March 19th).. దైవ బలం రక్షిస్తోంది
ఈ రోజు(2024 March 19th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
మేషం
వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కొత్త పనులను ప్రారంభించే ముందు మంచి చెడులను ఆలోచించి ముందుకు సాగండి. కీలక వ్యవహారాలలో ముందుచూపు అవసరం. దైవ బలం రక్షిస్తోంది. విష్ణు సందర్శనం శుభప్రదం. వృషభం
కొత్త పనులను ప్రారంభిస్తారు.పెద్దల ఆశీర్వచనాలు ఫలిస్తాయి. సమస్యగా అనిపించిన అంశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రయాణాలు శుభప్రదం. ఇష్టదేవతను ఆరాధిస్తే మంచిది. మిథునం
మీ మీ రంగాల్లో మీకు అనుకూలంగా వెలువడతాయి. కీలక సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఆంజనేయ ఆరాధన మంచిది.
కర్కాటకం
వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. విందు, వినోద,ఆద్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. దైవారాధన మానవద్దు. సింహం
శ్రమపెరగకుండా చూసుకోవాలి. కొన్ని పనులను ప్రారంభించి పూర్తిచేసే ప్రయత్నం చేస్తారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ప్రయాణాలు తప్పకపోవచ్చును. వృథా ఖర్చులు ఉన్నాయి. గోసేవ చేయాలి. కన్య
శుభవార్త వింటారు. అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు. శివుడిని ఆరాధించాలి.
తుల
ఒక ముఖ్యమైన విషయంలో మీరు ఆశించిన పురోగతి ఉంటుంది. మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మొదలుపెట్టిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. గణపతి స్తోత్రం పఠిస్తే ఇంకా బాగుంటుంది. వృశ్చికం
చేపట్టిన పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్నది సాధిస్తారు. అధికారులతో మాత్రం అంటీముట్టనట్టు ఉండటమే మంచిది. దక్షిణామూర్తి స్తోత్రం చదివితే మంచిది. ధనుస్సు
మొదలుపెట్టిన కార్యాలు ఇబ్బందులు ఎదురవకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ సౌఖ్యం కలదు. చంద్ర ధ్యానం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.
మకరం
శ్రమ పెరగకుండా చూసుకోవాలి. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని కీలక పనులను పూర్తిచేయగలుగుతారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. శివస్తోత్రం పఠిస్తే మంచిది. కుంభం
తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. వాటిని సమర్థంగా నిర్వహించి అందరి ప్రశంసలూ పొందుతారు. విందూ వినోద ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శివారాధన శుభప్రదం. మీనం
బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. సూర్యారాధన ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.