NDL: రుద్రవరం మేజర్ పంచాయతీ మార్కెట్ వేలం పాటలు రేపు నిర్వహిస్తున్నట్లు ఇన్ఛార్జ్ ఈవో వడ్డె రామకృష్ణ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. డివిజనల్ పంచాయతీరాజ్ అధికారి రాంబాబు ఆదేశాల మేరకు మార్కెట్ వేలం పాటలను నిర్వహిస్తున్నామన్నారు. వారం సంత మార్కెట్కు రూ.లక్ష, దినసరి మార్కెట్కు రూ.50,000 చొప్పున డిపాజిట్ చెల్లించి వేలంపాటల్లో పాల్గొనవచ్చన్నారు.