హీరో, హీరోయిన్లు ఒక్కొక్కరు పెళ్లి పీఠలెక్కడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో జాతి రత్నాలు సినిమాలో నటించి చిట్టిగా ఫేమస్ అయిన ఫరియా అబ్దుల్లా కూడా పెళ్లికి రెడీ అయినట్టుగా తెలుస్తోంది. ఇంతకీ వరుడు ఎవరు?
Faria Abdullah: ప్రస్తుతం టాలీవుడ్ హీరో, హీరోయిన్ల పెళ్లిల సీజన్ నడుస్తోంది. ఆ మధ్య వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. రీసెంట్గా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ ఎంగేజ్మెంట్ జరిగింది. త్వరలోనే వీరి పెళ్లి జరగనుంది. ఇక ఇప్పుడు మరో యంగ్ బ్యూటీ కూడా పెళ్లికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా.. జాతి రత్నాలు సినిమాతో ఒక్కసారిగా చాలా ఫేమస్ అయిపోయింది.
చిట్టిగా తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన జాతి రత్నాలు సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో చిట్టికి వరుస ఆఫర్లు వచ్చాయి. నాగార్జున నటించిన బంగార్రాజు సినిమాలో గెస్ట్ రోల్లో కనిపించింది. ఆ తర్వాత లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, రావణాసుర వంటి సినిమాలలో హీరోయిన్గా నటించింది. కానీ ఆ రెండు సినిమాలు ఫ్లాప్ అవడంతో అమ్మడికి పెద్దగా కలిసి రాలేదు. ప్రస్తుతం అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. దీంతో పాటు ఓ తమిళ సినిమాలో కూడా నటిస్తుంది.
ఇదిలా ఉంటే.. త్వరలోనే ఫరియా అబ్దుల్లా పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. తన చిన్ననాటి స్నేహితుడితో చిట్టి పెళ్లి అని ప్రచారం జరుగుతోంది. చిట్టికి కాబోయే వాడు.. ప్రస్తుతం షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాడని అంటున్నారు. ఇప్పటికే వీరి ప్రేమకు పెద్దలు ఓకె చెప్పారని.. ఈ ఏడాదిలోనే పెళ్లి ఉంటుందని అంటున్నారు. మరి చిట్టి దీనిపై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.