Karnataka: బెంగళూరుకి చెందిన ఓ కోడలు వృద్ధుడైన తన మామను చేతి కర్రతో చితకబాదింది. కూతురు ఫిర్యాదు మేరకు కోడలిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగుళూరుకి చెందిన పద్మనాభ సువర్ణ(87) అనే వృద్ధుడు కుల్శేఖర్ ఏరియాలో ఉంటున్నాడు. ఈయన కుమారుడు బయట దేశంలో ఉంటున్నారు. తన కోడలు ఉమా శంకరితో కలిసి అతను మంగుళూరులో ఉంటున్నారు.
In a shocking incident, the #MangaluruPolice have arrested a woman for assaulting her father-in-law with a walking stick at #Kulshekar, #Mangaluru, on March 11.
The arrested has been identified as #Umashankari from Kulshekar.
మామ సోఫా మీద షర్ట్ ఉంచాడని కోడలు చేతి కర్రతో అతనిపై దాడి చేసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వృద్ధుడి కూతురు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తీవ్ర గాయాలపాలైన వృద్ధుడు ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఉమా శంకరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈమె అట్టవార్లోని ఎలక్ట్రిసిటీ ప్రొవైడర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఉమాపై కఠిన చర్యలు తీసుకోవాలని పద్మనాభ కూతురు డిమాండ్ చేసింది.