Cylinder Blast : పేలిన సిలిండర్లు.. ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు సజీవ దహనం
ఓ ఇంట్లో షార్ట్ సర్య్కూట్ కారణంగా రెండు సిలిండర్లు పేలిపోయాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ దహనం అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Cylinder Blast : ఇంట్లో అనుకోకుండా జరిగిన షార్ట్ సర్య్కూట్ ఐదుగురు సజీవ దహనం అవడానికి కారణం అయ్యింది. ఉత్తర ప్రదేశ్( Uttar Pradesh)లోని లక్నో జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది. ముందు షార్ట్ సర్య్కూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ సమీపంలో ఉన్న సిలిండర్ల పేలిపోయాయి. దీంతో అక్కడ ఆ కుటుంబంలోని ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు చనిపోయారు.
సంఘటన సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అలాగే అగ్నిమాపక సిబ్బంది కూడా మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ముషీర్ అనే వ్యక్తి తన కుటుంబంతోపాటు కకోరి(Kakori) పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నాడు. ముషీర్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా బంధువులంతా కలిశారు.
మంగళవారం రాత్రి 10:30 సమయంలో ఇంట్లోని రెండో అంతస్థులో షార్ట్ సర్య్కూట్ జరిగింది. దానికి దగ్గరలో రెండు సిలిండర్లు ఉన్నాయి. అవి పేలిపోయాయి. ఇంటి పైకప్పు కాలిపోవడం వల్ల ఇంట్లో ఉన్న ముషీర్, హుస్న్ బానో, ఉమ, హీనా, రాయలు సజీవ దహనం అయ్యారు. ఈ ప్రమాదంలో ముషీర్ కుమార్తె ఇషాతో పాటు బంధువులు లకబ్, అజ్మద్ తదితరులు గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.