ప్రకాశం: గిద్దలూరు మండలంలోని ముండ్లపాడు గ్రామ సమీపంలో సోమవారం కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తులను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంపై సమాచారాన్ని అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.