భారతీయ సంపన్నుల్లో అగ్రగణ్యుడైన ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జామ్‌నగర్‌లో జరగనున్నాయి. వీటికి హాజరయ్యే అంతర్జాతీయ, జాతీయ ప్రముఖులందరికీ అల్ట్రా లగ్జరీ టెంట్లను ఏర్పాటు చేస్తున్నారు.
anant ambani pre wedding celebrations : ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడైన అనంత్ అంబానీ వివాహం రాధికా మర్చెంట్‌తో వచ్చే జులైలో జరగనున్న విషయం అందరికీ తెలిసిందే. అంతకు ముందుగా మార్చి ఒకటి నుంచి మూడో తేదీ వరకు జామ్ నగర్లో ప్రీ వెడ్డింగ్ సెబ్రేసన్స్ జరుగుతున్నాయి. అయితే జామ్ నగర్లో ఫైవ్‌స్టార్ హోటళ్లు ఎక్కువగా అందుబాటులో లేని నేపథ్యంలో అతిథుల కోసం వీరు అల్ట్రా లగ్జరీ టెంట్లను ఏర్పాటు చేయనున్నారు.
అనంత్ అంబానీ(anant ambani), రాధికా మర్చెంట్( Radhika Merchant)ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కోసం అంతర్జాతీయ, జాతీయ ప్రముఖులందరికీ ఆహ్వానాలు అందాయి. ఇవాంకా ట్రంప్, జుకర్‌బర్గ్, సుందర్ పిచాయ్, బిల్‌గేట్స్ లాంటి అంతర్జాతీయ ప్రముఖులు సైతం ఈ వేడుకలకు హాజరు కానున్నారు. అలాగే మన దేశంలో ప్రముఖులైన అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్… సహా పలువురు బాలీవుడ్ నటులు ఈ వేడుకల్లో పాలు పంచుకోనున్నారు.
ఇంకా ప్రముఖ క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, కృనాల్ పాండ్యా, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ తదితరులంతా పాల్గొనున్నారు. ఈ ప్రముఖులందరికీ ఏ లోటూ రాకుండా ఆతిథ్యం ఇచ్చేందుకు జామ్ నగర్లో అల్ట్రా లగ్జరీ టెంట్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో టైల్స్‌తో ఉన్న బాత్రూమ్లు సహా సకల సదుపాయాలు ఉండనున్నాయి.