మరో రెండురోజుల పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని.. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
మిగ్జామ్ తుఫాన్ బాపట్ల తీరాన్ని దాటింది. తీరం దాటే సమయంలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
మిచౌంగ్ తుపాన్ ప్రభావంతో తమిళనాడు రాష్ట్రాన్ని అతలాకుతలం అయ్యింది. వరదల కారణంగా రహదారులు ఎక్కడిక్కడ స్తంభించిపోయాయి.
కోస్తా జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఏపీపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కోస్తా రాయలసీమకు భారీ వర్ష సూచన ఉంది. నాలుగు, ఐదు, ఆరు తేదీల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభావంతో పలు చోట్ల వానలు కురియనున్నట్లు తెలిపారు.
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ ప్రకటించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలతోపాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా వానలు పడే అవకాశం ఉందని తెలిపింది.
దక్షిణ భారతదేశంలో వాతావరణం చాలా వేగంగా మారుతోంది. ఒక్కసారిగా భారీ మేఘాలు కమ్ముకుంటున్నాయి. కొన్ని గంటల్లోపే అవి అదృశ్యమవుతాయి. దీనికి ప్రధాన కారణం ఈదురు గాలులు.
అల్పపీడన ప్రభావంతో మరో రెండు రోజులు వాతావరణం చల్లగానే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
హైదరాబాద్లో ఈరోజు ఉదయం నుంచి చిరుజల్లులు కురుస్తున్నాయి. కాప్రా, ఘట్‌కేసర్, సరూర్‌నగర్, ఉప్పల్, అమీర్ పేట్, జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, సికింద్రాబాద్ సహా పలు చోట్ల ఈ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.
ఈశాన్య రుతుపవనాల చురుకుగా మారినట్టు భారత వాతావరణ శాఖ ప్రకటించింది.కేరళలోని కొన్ని జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడిందని తెలిపింది.
వాతావరణ కాలుష్యం కారణంగా భూతాపం పెరిగిపోతుంది. మరో రెండు డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగితే భారత్‌తో పాటు తూర్పు పాకిస్థాన్ తీవ్రమైన సమస్యలను ఎదుర్కొవలసి వస్తుందని తాజాగా ఒక నివేదిక హెచ్చరించింది.
రాష్ట్రంలో ఇంకో నాలుగు రోజులు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతోపాటు పక్క రాష్ట్రమైన ఏపీలో కూడా వర్షాలున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది
హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. దీంతోపాటు వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే భాగ్యనగరంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. రోడ్లపై పెద్ద ఎత్తున నీరు చేరడంతో వాహనదారులు ప్రయాణించాలంటే ఇబ్బందిగా మారింది.
రాష్ట్రంలోని హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి పెద్ద ఎత్తున వర్షం కురుస్తోంది. దీంతో భాగ్యనగరంలోని రోడ్లపై భారీగా నీరు నిలిచి ప్రయాణానికి ఆటంకంగా మారింది. ఇప్పటికే అధికారులు హైదారాబాద్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.