Young women excited by pole dancing in Delhi Metro.. Video goes viral
వికృత కార్యకలాపాల(Perverse activities)తో గత కొంత కాలంగా ఢిల్లీ మెట్రో(Delhi Metro) రైళ్లు వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా మరో కొత్త వీడియో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. ఈ వీడియో చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటికే ఢిల్లీలో మెట్రో ప్రయాణికులకు ఇబ్బంది కలించే చాలా కార్యకాలపాలు వెలుగులోకొచ్చాయి. ఇప్పుడు గర్ల్స్ పోల్ డ్యాన్స్(Girls Pole Dance) కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇలాంటి వింత పనుల కారణంగా ఢిల్లీ ప్రజలు మెట్రో అంటే ఏ రోజునా ఏం చూడాల్సి వస్తుందోనని ఆలోచిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ మెట్రోలో అన్ని రకాల పనులకు సంబంధించిన దృశ్యాలు చూశారు. చాలా మంది ప్రయాణికులు తమ ఇంట్లో చేసే అన్ని పనులు, వీధుల్లో చేసే అన్ని పనులు మెట్రోలలో చేశారు. వాదించుకోవడం దగ్గరనుంచి కొట్లాడుకోవటం, డ్యాన్సులు, పాటలు పాడటం, ముద్దులు పెట్టుకుంటూ, అసభ్యకరమైన సినిమాలు చూడడమే కాదు చేతల వరకు అన్ని జరిగాయి. ఒక పోల్ డ్యాన్స్ మిగిలే ఉందని భావించారేమో దాన్ని కూడా భర్తి చేశారు ఈ యువతులు. మెట్రోలు ఈ అమ్మాయిల చేసే డ్యాన్స్ లను మెట్రో ప్రయాణికులు వినోదభరితంగా చూడసాగారు.
తాజగా హన్స్నా జరూరీ హై అనే ట్విట్టర్ పేజీ ద్వారా అశ్లీల చిత్రాలు, ముద్దులు, కొట్లాడుకోవడాల తరువాత ఇప్పుడు పోల్ డ్యాన్స్ అనే క్యాప్చన్ తో ఈ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ట్విట్టర్ తెగ వైరల్ అవుతుంది.